ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఆహ్వానం
VZM: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీ ఈనెల 9, 12, 15వ తేదీల్లో గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్ కుమార్ శనివారం తెలిపారు. 10వ తరగతి పైగా చదివిన, అర్హత కలిగిన యువతీ యువకులు అవసరమైన సర్టిఫికెట్లతో ర్యాలీలో పాల్గొనాలని సూచించారు.