'నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవా చేయాలి'
ASF: దహెగాం మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్‌లను MLA హరీష్ బాబు మంగళవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గెలిచిన అభ్యర్థులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేయాలని సూచించారు. అధికారం వచ్చిందని అహంకారాన్ని దరి చేరనివ్వకుండా ప్రజల మన్ననలు పొందాలని తెలిపారు.