VIDEO: తంబళ్లపల్లెలో నెల రోజులుగా ఉబికి వస్తున్న నీరు
అన్నమయ్య: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండ కింద మద్దాభక్తుని బావి వద్ద ఉన్న బోరు నుంచి నీరు పైకి ఉబికి వస్తోంది. 50 ఏళ్ల కిందట కొండకు వచ్చే భక్తుల తాగునీటి ఈ బోరు వేసవిలో బోరులో నీరు అడుగంటింది. ప్రస్తుతం నెల రోజులుగా నీరు ఉబికి వస్తోంది. దీంతో కొండకు వచ్చే స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నీటిని వృథా కాకుండా చూడాలని కోరుతున్నారు.