ఆవును దహనం చేసిన ఫారెస్ట్ అధికారులు
ASR: రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామంలో ఆవుపై పులి దాడి చేసింది. ఈ ఘటనపై అధికారులు ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. పులి దాడి చేసిన ఆవు కళేబరాన్ని దహనం చేశారు. సబ్ DFO సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కోరుమిల్లి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో దట్టమైన పొదలలో పులి ఉన్నట్లు తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.