తొలి రోజు 93.33శాతం పించిన్ల పంపిణీ
E.G: జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ 93.33శాతం పూర్తయ్యిందని అధికారులు తెలిపారు. 2,51,748 మందికి గాను రూ.118.25 కోట్ల మేర పంపిణీ పూర్తి చేశామన్నారు. దనవాయిపేటలో పాన్‌షాప్ నిర్వహిస్తున్న దివ్యాంగురాలు కూరపాటి ధనలక్ష్మికి కలెక్టర్ కీర్తి చేకూరి పింఛను అందజేశారు. మిగతా వారికి ఈ రెండు రోజుల్లో అందజేస్తామని పేర్కొన్నారు.