అన్న క్యాంటీన్ సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ సోమవారం కాకినాడలోని అన్నమ్మ ఘాట్ సెంటర్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్లలో పరిశుభ్రత లోపించడంపై ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. అన్న క్యాంటీన్లు పరిశుభ్రతకు మారుపేరుగా ఉండాలని సూచించారు.