రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు

ప్రకాశం: మార్కాపురం మండలం వేములకోటలోని జగనన్న కాలనీ సమీపంలో సోమవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని మార్కాపురం సర్వజన వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.