VIDEO: డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

VIDEO: డివైడర్‌ను ఢీకొట్టిన లారీ

WGL: వరంగల్ నగరంలోని ఎంజీఎం కూడలి ప్రాంతంలో సోమవారం ఆటోనగర్ నుంచి వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కన ఉన్న డైరీ పార్లర్‌ను బలంగా దెబ్బతీయడం జరిగింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ పూర్తి మత్తులో ఉండి లారీ నడిపించినట్టు స్థానికులు తెలిపారు. లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయినందున ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సహాయంతో లారీని తొలగించే చర్యలు చేపట్టారు.