అక్రమంగా మట్టి తరలిస్తున్న.. వాహనాలు సీజ్
WGL: ఖానాపురం మండలం వేపచెట్టుతండా శివారులోని RARF భూముల నుంచి నిన్న అర్ధరాత్రి అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్న జేసీబీ, టిప్పర్లను అటవీశాఖ సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీట్ ఆఫీసర్ వెంకన్న నేతృత్వంలో సిబ్బంది దాడులు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుని నర్సంపేట అటవీ కార్యాలయానికి తరలించారు. వాహనాలను సీజ్ చేసి విచారణ చేపట్టామని రేంజర్ తెలిపారు.