ఐఎఫ్‌టీయూ యూనియన్ లో చేరిన భవన నిర్మాణ కార్మికులు

సూర్యాపేట: మద్దిరాల మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ సమక్షంలో ఐఎఫ్‌టీయూలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని, వాటిని పరిష్కరించడంలో సంక్షేమ బోర్డు అధికారులు వైఫల్యం చెందుతున్నారని, తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలన్నారు.