ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు
WGL: పట్టణ కేంద్రంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నేడు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి అభిషేకాలు చేసి.. వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.