'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

VSP: వినాయకచవితి ఎటువంటి గొడవలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బొబ్బిలి గ్రామీణ సీఐ నారాయణరావు తెలిపారు. తెర్లాం పోలీసు స్టేషన్ ఎస్సీ కాలనీలో గ్రామస్తులకు శుక్రవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు.