టీ-మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

టీ-మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

WGL: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. వరంగల్ మాజీ మేయర్‌గా పని చేసిన స్వర్ణ.. డీసీసీ ప్రెసిడెంట్‌గా కూడా సేవలు అందించారు. ఎర్రబెల్లి స్వర్ణ, వరదరాజేశ్వరరావు దంపతులు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్లుగా అందిస్తున్న సేవలకు గాను కాంగ్రెస్ నిర్ణయంతో తగిన గుర్తింపు లభించినట్లు అయింది.