ఈనెల 5న ఆధార్ ప్రత్యేక శిబిరం

VSP: సబ్బవరం మండలంలో ఈనెల 5న ఆధార్ ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ పద్మజ శుక్రవారం తెలిపారు. 5న అసకపల్లి, సబ్బవరం, గొర్లెవానిపాలెంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా పేర్లు నమోదు, చిరునామా మార్పులు, తప్పులను సరిదిద్దుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.