కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఈవోల విచారణ

AKP: గొలుగొండ మండలం సీహెచ్.నాగాపురంలో స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను పాఠశాల ఛైర్మన్ అప్పారావు ఆవిష్కరించలేదని సర్పంచ్ రఘురామచంద్రరావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సందర్భంగా గ్రామంలో ఎంఈవోలు సత్యనారాయణ, కృష్ణప్రసాద్ విచారణ చేపట్టారు. సర్పంచ్, స్కూల్ కమిటీ ఛైర్మన్, గ్రామస్థులు, నాయకుల సమక్షంలో విచారణ చేసి అందరి వాదనలను రికార్డ్ చేసుకున్నారు.