సీపీఎం, బీఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం

సీపీఎం, బీఆర్ఎస్ నాయకుల విస్తృత ప్రచారం

KMM: ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని, తెల్లారుపల్లి 14 వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సీపీఎం పార్టీ అభ్యర్థి మడిపల్లి వెంకన్న శుక్రవారం వార్డులో సీపీఎం నాయకులతో కలిసి విస్తృత ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. సమస్యల పరిష్కారానికి పార్టీ చేసిన పోరాటాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.