బొబ్బిలిలో భారీ చోరీ
VZM: బొబ్బిలిలోని వెలమవారివీధి సన్ రే అపార్ట్మెంట్‌లో ఆదివారం భారీ చోరీ జరిగింది. 3వ అంతస్తులో ఉంటున్న టీచర్ రామకృష్ణ తన కుమార్తె వద్దకు వెళ్లగా.. అతని భార్య రాధ స్వగ్రామం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దుండగులు తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.15 లక్షలు, 12 తులాల నగలను దోచుకెళ్లారు. పక్కింటి వారు సమాచారం ఇవ్వడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.