'జిందాల్ సంస్ద తలపెట్టిన పనులు అడ్డుకుని తీరతాం'

'జిందాల్ సంస్ద తలపెట్టిన పనులు అడ్డుకుని తీరతాం'

VZM: బాధితులకు న్యాయం జరగకపోతే జిందాల్ సంస్థ తలపెట్టిన పనులను అడ్డుకొని తీరుతామని AP రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్‌ మంగళవారం హెచ్చరించారు. ఎస్‌.కోట మండలం బొడ్డవర వద్ద జిందాల్‌ బాధితులు 137 రోజులుగా పోరాటం చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం శోచనీయం అన్నారు. జిందాల్‌ చేపట్టిన మట్టి పనులు అడ్డుకున్న 18 మహిళలను నిర్బంధించడం అమానుష చర్య అన్నారు.