యూరియా కోసం ఆందోళన చెందవద్దు: ఏవో

MDK: నార్సింగి మండల వ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయ శాఖ అధికారి హరి ప్రసాద్ అన్నారు. మండలానికి కావాల్సిన యూరియాను ఈ నెలలో ప్రభుత్వం అందిస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. ప్రస్తుతం రైతులు అవసరం ఉన్న మేరకే యూరియా తీసుకోవాలని, యూరియాను రైతులు నిల్వ చేసుకోవద్దని ఆయన సూచించారు.