కోనసీమ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ

కోనసీమ: జిల్లాలో సోమవారం పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA MD రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాతోపాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామన్నారు. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని హెచ్చరించారు.