శ్రీవారి సేవలో ప్రముఖులు

శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుపతి: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. సినీ నటుడు ప్రియదర్శి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తెలంగాణ మంత్రి కొండా సురేఖ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు.