అంబేద్కర్ ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించిన ఎంపీ
PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సామాజిక సమతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'అంబేద్కర్ ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలను ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఎంపీకి శాలువాలతో సన్మానం చేశారు. క్రీడలను ప్రారంభించిన అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. రామగుండంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులు కేటాయించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.