ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డికి ఊరట
AP: ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. లక్నో వెళ్తున్న కారణంగా..సిట్ ఆఫీసుకు హాజరుకాలేనని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఈ నెల 15 వరకు మినహాయింపు ఇచ్చింది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే.