సుబ్రహ్మణ్యేశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు
ELR: సింగరాయపాలెం చేవూరుపాలెం సెంటర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. మావుళ్లమ్మ ఆలయ సహాయ కమిషనర్ మహాలక్ష్మి నగేశ్ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు జరిగింది. ఆలయ సహాయ కమిషనర్ గంగా శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. 134 రోజులకుగాను మొత్తం రూ.15.54 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే 750గ్రా. వెండి, 2 మిల్లీ గ్రాముల బంగారాన్ని భక్తులు సమర్పించారన్నారు.