అధ్వానంగా రోడ్డు.. పట్టించుకోని అధికారులు
KDP: సిద్ధవటం మండలం కడపాయపల్లి మీదుగా జగనన్న కాలనీ, మూడు గ్రామాల పొలాలకు వెళ్లే రోడ్డు ఇది. వర్షాలకు వరదమయంగా మారింది. ఉపాధి హామీ వ్యవసాయ పనులకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నడవడానికి సైతం వీలుగా లేదని వాపోతున్నారు. మండల అధికారులకు చెప్పిన స్పందించడం లేదని ఆరోపించారు. సంబంధించిన అధికారులు రోడ్డు నిర్మించాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.