యావపూర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

యావపూర్‌లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. యావపూర్ సర్పంచ్ ఎంజాల స్వామి ఆధ్వర్యంలో యువకులు స్వచ్ఛభారత్ నిర్వహించారు. చీపుర్లు పట్టి వీధులు శుభ్రం చేశారు. వీధులలో అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించారు. గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వివరించారు.