అప్పుడు యూరియా.. ఇప్పుడు గ్యాస్..
SRPT: మొన్నటి వరకు గ్రామాల్లో యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల తరబడి బారులు తీరారు. ఇప్పుడు పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం లబ్ధిదారులు ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. సిలిండర్ బుకింగ్ గడువును 45 రోజులకు పెంచడంతో, సకాలంలో గ్యాస్ అందుతుందో లేదో అని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వరుసగా ఎదురవుతున్న ఈ ఇబ్బందులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.