'సర్వే నం.260లో కబ్జాలను అడ్డుకోండి'
NRML: ముధోల్ మండల కేంద్రంలోని సర్వే నం.260లో అక్రమ మొరం తవ్వకాలను నిలిపివేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అలాగే యూపీఎస్ పాఠశాల ముందు అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డును తొలగించి, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరి పోతన్న తదితరులు పాల్గొన్నారు.