గరిమేకలపల్లిలో ఘనంగా వీర ఓబులమ్మ ఉత్సవాలు

గరిమేకలపల్లిలో ఘనంగా వీర ఓబులమ్మ ఉత్సవాలు

సత్యసాయి: రామగిరి మండలం గరిమేకలపల్లిలో వెలసిన వీర ఓబులమ్మ అమ్మవారి ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతగా భావించే అమ్మవారికి గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాది మార్చి నెలలో రెండు రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.