ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

MHBD: మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా నలు మూలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు రాజీనామాలు చేసి ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బయ్యారం, గూడూరు, కేససముద్రం తదితర మండలాలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు.