అచ్చంపేట్ క్యాంపులో నేడు కుస్తీ పోటీలు

KMR:నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ క్యాంపులో ఇవాళ బుధవారం కుస్తీ పోటీలు జరగనున్నాయి. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు స్థానిక, చుట్టూ పక్కల మండలాల నుంచి మల్లయోధులు తరలి వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారని గ్రామస్థులు తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం సమయంలో ఈ పోటీలు ప్రారంభమవుతాయన్నారు.