VIDEO: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వరా..?

VIDEO: పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వరా..?

కోనసీమ: అయినవిల్లి మండలం పొట్టిలంక గ్రామంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీకి నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం 70 సెంట్లు భూమి కొనుగోలు చేసిందని ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడంతో ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు కాపురం ఉంటున్నామని స్థానిక మహిళ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.