పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
KNR: హుజురాబాద్ మండలంలోని రాంపూర్‌లో పశువైద్య నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మూడు నెలల వయసు దాటిన గేదె, గోజాతి పశువులకు ఈ టీకాలు వేయించాలని పశువైద్యుడు సాయిచరణ్ రైతులకు సూచించారు. ఇదే సమయంలో పశువులకు ట్యాగులను కూడా అమర్చారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.