108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కోఆర్డినేటర్

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కోఆర్డినేటర్

PDPL: ధర్మారం 108 అంబులెన్స్‌‌ను జిల్లా కో-ఆర్డినేటర్ జంపాల కుమారస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టెతస్కోప్, బీపీ ఆపరేటర్, పల్స్ ఆక్సీ మీటర్, మల్టీ ఛానల్ మానిటర్, ఆక్సిజన్ వ్యవస్థ పనితీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసర కాల్స్ వచ్చిన వెంటనే స్పందించాలని, రోగుల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.