ఒక్క ఓటుతో వరించిన విజయం
MNCL: భైంసా మండలంలోని లింగా గ్రామ సర్పంచ్‌గా సుష్మారాణి ఒక్క ఓటుతో విజయం సాధించారు. గ్రామంలో 293 ఓట్లు పోలయ్యాయి. సుష్మరాణికి 143, సమీప ప్రత్యర్థి స్వాతికి 142, రాధికకు 4 ఓట్లు, మరో 4 ఓట్లు నోటాకు వేశారు. చివరి దాకా ఉత్కంఠ నెలకొనగా ఒక్క ఓటుతో సుష్మరాణి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఇక్కడ రీకౌంటింగ్ జరిగిన సుష్మరాణే గెలిచారు.