పిల్లల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి

KRNL: ఉత్తమ ఫలితాలు సాధించడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో ముఖ్యమని నందిగాం మండలం లఖిదాసుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలుకు కృష్ణారావు అన్నారు. పాఠశాలలో శుక్రవారం పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్ధికి సరైన పౌష్టికాహారం, తగినంత నిద్ర అవసరమని, పిల్లల చదువుపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు.