నేడు సింహాచలంలో నరకాసురవధ
VSP: నరకచతుర్దశిని పురస్కరించుకుని సోమవారం రాత్రి సింహగిరిపై జరిగే నరకాసురవధ ఉత్సవానికి దేవస్థానం వైదిక, అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో భాగంగా నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోనూ, శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను మరొక పల్లకిలోనూ వేంజింపజేస్తామని డిప్యూటీ ఈవో సింగం రాధ తెలిపారు.