VIDEO: 'అభివృద్ధి పనుల కోసం రూ. 70 కోట్ల నిధులు మంజూరు'
NRML: ముథోల్ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ. 70 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శనివారం తెలిపారు. ఎమ్మెల్యే కోటాలోని ఈ నిధులతో ఆయా గ్రామాల్లో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సర్పంచులకు అభివృద్ధి పనుల ప్రొసిడింగ్ కాపీలను అందజేశారు.