జిల్లా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్‌గా చక్ర రమేశ్
KKD: కాకినాడ బీజేపీ జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్‌గా చక్ర రమేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మంగళవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చాటిచెప్పాలని కోరారు. పార్టీ సిద్ధాంతాలను మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని రమేశ్‌కు ఆయన సూచించారు.