వినుకొండ బస్టాండ్‌లో వృద్ధుడి మృతి

వినుకొండ బస్టాండ్‌లో వృద్ధుడి మృతి

PLD: వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ వృద్ధుడు మృతి చెంది ఉన్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.