మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో డీఈవో సమావేశం

మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో డీఈవో సమావేశం

ATP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈనెల 26న అమరావతిలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థులతో శుక్రవారం అనంతపురం జిల్లా విద్యాధికారి ప్రసాద్ బాబు సమావేశమయ్యారు. జిల్లా నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పలు అంశాలపై చర్చించారు. మాక్ అసెంబ్లీలో సమర్థవంతంగా పాల్గొనేందుకు ఈ సమావేశం దోహదపడింది.