VIDEO: ఆలయంలో 'కోయిల్ ఆల్వార్ తిరుమంజనం'

VIDEO: ఆలయంలో 'కోయిల్ ఆల్వార్ తిరుమంజనం'

CTR: పుంగనూరులోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ ఘనంగా నిర్వహించారు. ‘మకర వెలుగు’ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం అయ్యప్ప స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కేరళ సంప్రదాయానికి అనుగుణంగా పడిమెట్ల పూజతో పాటు జ్యోతి దర్శనం కల్పించనున్నారు.