ధర్మవరంలో 2.47 లక్షల ఓటర్లు: ఆర్డీవో
సత్యసాయి: ఓటర్ల జాబితా ప్రక్రియపై ఆర్డీవో మహేశ్ మంగళవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గంలో 2,47,688 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో 1,25,069 మంది మహిళలు, 1,22,597 మంది పురుషులు ఉన్నారని వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 295 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, త్వరలో నూతనంగా మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.