రేపు మండల సర్వసభ్య సమావేశం
SKLM: బూర్జ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం 10.30 గం.కు ఎంపీపీ కర్నేన దీప అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆర్.తిరుపతిరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, గ్రామ సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు తప్పక హాజరు కావాలని కోరారు.