VIDEO: వేట్లపాలెం మృతులకు పక్కా ఇళ్లు: సీఎం చంద్రబాబు
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పేలుడులో మృతి చెందిన 28 మంది కుటుంబాలకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. ఇప్పటికే రూ.22 లక్షల ఆర్థిక సాయం ప్రకటించగా, సొంత ఇల్లు లేని మృతుల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు. వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు.