VIDEO: 'గూడూరు ఎంఈవోను సస్పెండ్ చేయాలి'
KRNL: గూడూరు ఎంఈవోను సస్పెండ్ చేయాలని కోరుతూ.. సోమవారం విద్యార్థి సంఘాల నాయకులు స్పెషల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. భరత్, ఆనంద్, అంజీ మాట్లాడుతూ.. విద్యార్థులతో ఎంఈవో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను స్పెషల్ కలెక్టర్‌కు నివేదిక రూపంలో ఇచ్చామన్నారు. తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.