VIDEO: 'ఉస్తాద్' జాతర: పవన్ ఫ్యాన్స్ సందడి
NLG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల సందర్భంగా నల్గొండలో థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. భారీ ఎత్తున టపాసులు కాలుస్తూ, నినాదాలు చేస్తూ ఫ్యాన్స్ పండుగ వాతావరణం సృష్టించారు. థియేటర్ పరిసరాలు అభిమానుల తాకిడితో కిక్కిరిసిపోయాయి. తమ అభిమాన హీరో సినిమా రావడంతో పాలాభిషేకాలు, పూలమాలలతో వేడుకలు జరుపుకున్నారు.