కరెంట్ షాక్ తగగిలి పశువులు మృతి

కరెంట్ షాక్ తగగిలి పశువులు మృతి

WNP: ఏదుల మండలం మాచుపల్లిలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. బొగ్గు రాములు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న కోడేరు మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పశుసంవర్ధక శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పరిహారం ఇప్పించాలని ఆయన కోరారు.