LPG సరఫరాపై కేంద్రం కీలక అప్‌డేట్

LPG సరఫరాపై కేంద్రం కీలక అప్‌డేట్

గల్ఫ్ ఉద్రిక్తతల మధ్య LPG సరఫరాపై కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన రెండు గ్యాస్ నౌకలు ఈనెల 16, 17 తేదీల్లో ముంద్రా, కాండ్లా పోర్టులకు చేరుకోనున్నాయని తెలిపింది. దేశంలో ఇంధన కొరత రాకుండా పోర్టుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరినట్లు పేర్కొంది. వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేసింది.