సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే

సత్యసాయి: కొత్తచెరువు మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన ప్రాథమిక సహకార సొసైటీకి అధ్యక్షులుగా అప్ప కొండప్ప, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరై నూతన బృందాన్ని అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.